ఢిల్లీలో కలకలం రేపిన కారు బాంబు పేలుడు కేసులో నిందితుడు జాసిర్ బిలాల్ వానీకి మిగతా ముఠా సభ్యులు పొటాషియం నైట్రేట్, షుగర్ పౌడర్ వంటి ఐఈడీ (IED) తయారీ సామగ్రిని సరఫరా చేశారు. అయితే, వీటిని పేలుడు పదార్థాలుగా ఎలా మార్చాలనే సాంకేతిక ప్రక్రియ కోసం నిందితుడు ఏకంగా యూట్యూబ్ వీడియోలను, చాట్‌జీపీటీ (ChatGPT) వంటి ఆధునిక ఏఐ టూల్స్‌ను ఉపయోగించి రాకెట్ ఐఈడీలను తయారు చేయడం,కేసు దర్యాప్తులో జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) అత్యంత దిగ్భ్రాంతికరమైన విషయాలను వెలుగులోకి తెచ్చింది.