ఢిల్లీలోని భారత్ మండపంలో జరుగుతున్న ఇండియా ఏఐ ఇంపాక్ట్ సదస్సులో వీరంగం చేసిన యువజన కాంగ్రెస్ కార్యకర్తలపై ఢిల్లీ పోలీసులు కొరడా ఝళిపించారు. ప్రధానమంత్రి మోదీకి, అమెకాతో వాణిజ్య ఒప్పందానికి వ్యతిరేకంగా చొక్కాలు విప్పి నిరసనలకు దిగిన కార్యకర్తలు అక్కడి నుంచి హడావిడిగా నిష్క్రమించారు. వేదక వద్దే నలుగురిని నిర్బంధంలోకి తీసుకున్న ఢిల్లీ పోలీసులు వారిని పాటియాలా హౌస్ కోర్టు ముందు హాజరుపరచనున్నారు. తక్కిన వారి కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు.

