ఆఫ్రికా దేశాల్లో ఎబోలా వైరస్ వేగంగా వ్యాపిస్తూ ప్రపంచాన్ని కలవరపెడుతోంది. కాంగో, ఉగాండా, దక్షిణ సూడాన్‌లలో ఇప్పటికే 140 మందికిపైగా మృతి చెందగా.. వందలాది అనుమానిత కేసులు నమోదయ్యాయి.ఎబోలా వైరస్ వ్యాప్తి ఈ మూడు దేశాలను తీవ్రంగా దెబ్బతీసిందని.. కావున డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, ఉగాండా, దక్షిణ సూడాన్‌తో సహా పలు దేశాలకు అన్ని రకాల అనవసర ప్రయాణాలను నివారించాలని భారతదేశం పౌరులకు సూచించింది.