బీహార్ అసెంబ్లీ ఎన్నికలలో గెలిచేందుకు ఎన్డీయే సర్కారు విభజన రాజకీయాలకు పాల్పడుతోందని కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకురాలు ప్రియాంకా గాంధీ ఆరోపించారు. నకిలీ జాతీయవాదం ను ప్రచారం చేస్తోందని విమర్శించారు. సమస్యల నుంచి ప్రజల దృష్టిని మళ్లించలేకనే ఓట్ల చోరీకి పాల్పడుతోందని బీజేపీపై మండిపడ్డారు. ఓట్ల తొలగింపు అనేది హక్కుల ఉల్లంఘనతో సమానమని పేర్కొన్నారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బెగుసరాయ్‌లో తన తొలి ప్రచారసభలో ప్రసంగించారు. దేశాభివృద్ధికి బీహార్ ఎంతో దోహదపడిందని అన్నారు.

