ఏపీలోని శ్రీకాకుళం జిల్లా కాశీ బుగ్గ ఘటనలో 9 మంది భక్తులు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై ఆలయ నిర్వాహకుడు హరిముకుంద్పండా స్పందించారు. ఇంతమంది భక్తులు వస్తారని తాను ఊహించలేదని, ఆలయానికి 2 వేల మంది భక్తులు వస్తుంటారని తెలిపారు. ఇలా జరుగుతుందని తాను ఊహించలేదని, ఇంతమంది వస్తారని తెలియక పోలీసులకు సమాచారం ఇవ్వలేదని అన్నారు. ఆలయంలోనే హరిముకుంద్పండాతో శ్రీకాకుళం జిల్లా కలెక్టర్, ఎస్పీ మాట్లాడారు. . ప్రస్తుతం కాశీబుగ్గ ఆలయ పరిసరాలను పోలీసులు తమ అధీనంలోకి తీసుకున్నారు.

