ఆంధ్రప్రదేశ్ లోని ఏలూరుకు చెందిన ఒక మహిళా లాయర్‌ను డిజిటల్ అరెస్ట్ పేరుతో అంతర్రాష్ట్ర సైబర్ ముఠా ఫోన్ చేసి తీవ్ర బెదిరింపులకు గురిచేసింది అమెరికాలో మహిళా లాయర్ కుమారులు ఆర్థిక నేరాలకు పాల్పడ్డారంటూ బెదిరింపులకు పాల్పడింది. ఆమె నుంచి రూ.52 లక్షలు కొల్లగొట్టింది. మూడు పోలీస్ బృందాలు యూపీ, ఢిల్లీ, మహారాష్ట్రలో 8 మందిని అరెస్టు చేశారు. ఈ స్కాం సూత్రధారులు బంగ్లాదేశ్‌కు పారిపోయినట్టు తెలుస్తోంది. భారత దేశంలో వీళ్లు మొత్తంగా రూ.100 కోట్లకు పైగా స్వాహా చేసినట్లు ప్రాథమిక సమాచారం .

